Tuesday, January 21, 2025

మా నుంచి మెరుపు దాడి ఉండవచ్చు

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌కు హెజ్‌బొల్లా హెచ్చరిక
ఇరాన్ దన్నుతో హెజ్‌బొల్లాకు ధైర్యం

బీరూట్ : గాజా యుద్ధం ఎనిమిదవ మాసంలో సాగుతుండగా ఇరాన్ మద్దతు ఉన్నలెబనీస్ తీవ్రవాద సంస్థ హెజ్‌బొల్లా తమ మెరుపు దాడికి సిద్ధంగా సిద్ధం కావలసిందని ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనూహ్య ఘటనలకు సిద్ధం కావలసిందని ఇజ్రాయెల్‌ను హెజ్‌బొల్లా ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాహ్‌ఒక టివి ప్రసంగంలో హెచ్చరించారు. ‘మా ప్రతిఘటన ఉద్యమం నుంచి అనూహ్య ఘటనలు మీకు ఉండవచ్చు’ అని నస్రల్లాహ్ శుక్రవారం హెచ్చరించారు. రెసిస్టెన్స్, లిబరేషన్ డే 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ హెచ్చరిక చేశారు.

లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో బలమైన దళంగా ఆవిర్భవించిన హెజ్‌బొల్లా పాలస్తీనా, గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై పోరు సాగిస్తోంది. పాలస్తీనా హమాస్ గ్రూప్ అక్టోబర్ 7న సాగించిన దాడి దరిమిలా గాజాలో సైనిక చర్యలను ఇజ్రాయెల్ నిర్వహిస్తోంది. సరిహద్దులోని ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ ఆ రోజు జరిపిన దాడిలో వెయ్యి మంది హతులయ్యారు. అయితే, గాజా యుద్ధంలో తమ లక్షాలు వేటినీ తాము సాధించలేదని ఇజ్రాయెల్ సొంత నేతలు అంగీకరించినట్లు నస్రల్లాహ్ తెలిపారు. వ్యూహాత్మక లక్షాలు వేటినీ తాము సాధించలేదని, అందుకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చునని ఇజ్రాయెలీ జాతీయ భద్రత మండలి చీఫ్ జాకి హనెగ్బీ ఒప్పుకోలు గురించి నస్రల్లా ప్రస్తావించారు. పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న ఇజ్రాయెల్‌కు తగిలిన ఎదురుదెబ్బలను నస్రల్లాహ్‌వివరించారు. ‘పాలస్తీనా దేశాన్ని కొన్ని ఐరోపా దేశాలు గుర్తించడం ఇజ్రాయెల్ దురాక్రమణకు తీరని నష్టం’అని నస్రల్లాహ్ అన్నట్లు ‘మిడిల్ ఈస్ట్ మానిటర్’ తెలిపింది. అంతర్జాతీయ తీర్మానాలను ఇజ్రాయెల్ మన్నించడం లేదని నస్రల్లాహ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News