Monday, December 23, 2024

అందరూ ఎంజాయ్ చేసే ‘హైయ్ ఫైవ్’ సినిమా

- Advertisement -
- Advertisement -

Hi Five Movie to release on July 22nd

నృత్య దర్శకుడి నుంచి ‘రణం’ చిత్రంతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘హైయ్ ఫైవ్’. రాధా రాజశేఖర్ నిర్మాత. ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం కొత్త, పాత నటీనటులతో రూపొందింది. ఈ చిత్రం ఈనెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “అమ్మ రాజశేఖర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ “నిర్మాత అయిన నా భార్య రాధకు థ్యాంక్స్ చెబుతున్నాను. నాతో పాటు కష్టాలు పడి సినిమా విడుదల వరకు తీసుకువచ్చింది”అని చెప్పారు. నిర్మాత రాధా రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా అందరూ బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ చౌదరి, సూర్య కిరణ్, విశ్వ, శివారెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దివి తదితరులు పాల్గొన్నారు.

Hi Five Movie to release on July 22nd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News