Wednesday, January 22, 2025

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హాయ్ నాన్న’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘హాయ్ నాన్న’ శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థీయేటర్లలో ప్రేక్షకులను ఆలరించింది. హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. ఈ మూవీలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఓటీటీలోకి ఈ మూవీ ప్రేక్షకులను ఆలరించేందుకు వచ్చేస్తుంది. సంక్రాంతి కానుగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది.

హాయ్ నాన్న డిజిట‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే భారీ ధ‌ర‌కు ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. థియేట‌ర్‌లో రిలీజైన‌ 40 రోజుల త‌ర్వాత మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాత‌ల‌తో నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ఒప్పందానికి అనుగుణంగా హాయ్ నాన్న‌ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News