Wednesday, January 22, 2025

‘హాయ్ నాన్న’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, హాట్ బ్యూటీ, సీతారామమ్ ఫేం మృణాల్ ఠాకూర్ ల కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ  ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు అద్భుత స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే నాని మరో బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు అనిపిస్తుంది.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన పాటలతో ముజిక్ లవర్స్ ను ఆకట్టుకున్న హేషామ్ అబ్దుల్ వహాబ్.. ఈ సినిమాపై అంచనాలు పెంచారు. కాగా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News