Sunday, December 22, 2024

‘హాయ్ నాన్న’ టీజర్ అప్పుడే విడుదల

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్ నాన్నా’ తో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం గ్లింప్స్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు.

‘హాయ్ నాన్నా’ టీజర్ అక్టోబర్ 15న విడుదల కానుంది. టీజర్ పోస్టర్ లీడ్ పెయిర్ -నాని,  మృణాల్ ఠాకూర్ డ్రీమ్ కెమిస్ట్రీని చూపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కోర్ పాయింట్‌ను టీమ్ ఇంకా వెల్లడించకపోవడంతో, సినీ ప్రేక్షకులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ తో స్టొరీ లైన్ గురించి కొంత స్పష్టత ఇస్తుందని భావిస్తున్నారు.

శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు.

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ‘హాయ్ నాన్నా’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News