Monday, January 20, 2025

యువతుల గదిలో రహస్య కెమెరా..ఇంటి యజమాని అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతులకు అద్దెకిచ్చిన గదిలో రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..అస్సాం కు చెందిన యువతి రెండు నెలల క్రితం తన సోదరుడు, స్నేహితురాలితో కలిసి యూసఫ్ గూడలోని వెంకటగిరి హైలం కాలనీలో ఒక గదిలో అద్దెకు దిగింది. అయితే యువతులపై కన్నేసిన ఇంటి యజమాని సయ్యద్ సలీమ్ గదిలో విద్యుత్ మీటర్ కోసం బాక్సు పెట్టించాడు. అందులో యువతులకు తెలియకుండా సిసి కెమెరా పెట్టాడు. ఆ సిసి కెమెరా ను తన గదిలో ఉన్న కంప్యూటర్ కు కలిపాడు.

యువతులు గదిలో ఉన్న సమయంలో ఏం చేస్తున్నారని సయ్యద్ సలీమ్ చూసేవాడు. తాజాగా యువతులకు అనుమానం వచ్చి విద్యుత్ మీటర్ కోసం పెట్టిన బాక్సును తెరిచి చూశారు. అందులో సిసి కెమెరా ఉండటాన్ని గమనించిన యువతులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి ఇంటి యాజమానిని అదుపులోకి తీసుకొని సెల్ ఫోన్, సిసి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News