Wednesday, January 22, 2025

హోటల్ గదిలో రహస్య సిసి కెమెరాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంషాబాద్: రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌లో సీతా గ్రాండ్ హోటల్ పేరుతో నడుస్తున్న హోటల్లో మూడో కంటికి తెలియకుండా సిసి కెమెరాలు అమర్చి, వీడియోలు తీస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అలసి కొద్దిసేపు సేద తీరడానికి హోటల్‌లోని రూమ్‌లకు వచ్చే జంటల వీడియోలను సీక్రెట్‌గా అమర్చిన సిసి హిడెన్ కెమెరాల ద్వారా వారి రహస్య వీడియోలను చిత్రీకరించాడు సదరు యజమాని. ఆ తర్వాత ఆ వీడియోలు వారికి చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. హోటల్ సీతా గ్రాండ్‌కు వస్తున్న యువతను, యువ జంటలను టార్గెట్ చేస్తూ నీచానికి పాల్పడిన హోటల్ యజమానిపై హోటల్‌కు వచ్చిన బాధితులు స్థానిక ఆర్‌జిఐ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..శంషాబాద్‌లో సీతా గ్రాండ్ పేరుతో హోటల్‌ను ఒంగోలుకు చెందిన గోపాల్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు. విమానాశ్రయం ఉండే రహదారి పక్కన ఉండడంతో ఈ హోటల్‌కు ఎక్కువగా యువత వచ్చి వెళ్తూ ఉంటారు. దీనిని అవకాశంగా మార్చుకుని రూముల్లోని బల్బుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చి, వారి వీడియోలను చిత్రీకరించేవాడు. మళ్లీ బాధితులకే పంపి, వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నాడు. ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించి యజమానిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News