Monday, December 23, 2024

ఈజిప్టు పిరమిడ్‌లో రహస్య గది..

- Advertisement -
- Advertisement -

కైరో: ఈజిప్టులోని చారిత్రక గ్రేట్ పిరమిడ్స్ అంతర్భాగంలో ఓ సువిశాలమైన గదిని కనుగొన్నారు. పిరమిడ్‌లలో 9 మీటర్లు అంటే దాదాపు 30 అడుగుల పొడవు, రెండు మీటర్లు అంటే 6 అడుగుల వెడల్పుతో ఉన్న గది ఉత్తరదిశలో ఉన్నట్లు , ఇటీవల జరిపిన పరిశోధనల క్రమంలో వెల్లడైంది. పిరమిడ్ పై భాగంలో స్కాన్ చేయగా లోపల ఈ ఛాంబర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ పిరమిడ్ కట్టడాల ప్రధాన ద్వారం పై ఓ మార్గంగా ఈ గది ఉంది. దీని ఉనికి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీనిని ఎందుకు వాడారనేది, ఎందుకు నిర్మించారనేది తెలియలేదు. పిరమిడ్‌లో వెలిసి ఉన్న ఈ ఛాంబర్ వివరాలను ఈజిప్టు ఆర్కియాలిజిస్టు జాహి హవాస్, దేశ పర్యాటక మంత్రి అహ్మద్ ఎయిస్సా తెలిపారు.

ఈజిప్టులో అత్యంత పురాతనమైన కట్టడాలు, స్థలాలలోని అంతుచిక్కని రహస్యాలను వెలికితీసేందుకు ఎప్పటికప్పుడు పురాతత్వ పరిశోధకుల బృందాలు స్కాన్ చేస్తున్నారు. కైరోకు 11 మైళ్ల దూరంలో ఉండే పిరమిడ్‌లను వీటిని నిర్మించిన కుఫు ప్రభువు పేరిట పిలుస్తారు. ఈజిప్టులో క్రీస్తు పూర్వం 4వ వంశపారంపర్య పాలకుడుగా కుఫు ఉన్నారు. 4500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పిరమిడ్ రాజవంశస్తుల ఖననం కోసం నిర్మించారు. ఇప్పటివరకూ ప్రాచీన ప్రపంచంలోని అత్యద్భుతాలలో చెక్కుచెదరని కట్టడాలలో ఒకటిగా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News