Monday, December 23, 2024

హై-వోల్టేజ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అశ్విన్ బాబు హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబ ఈనెల 20న విడుదల కానుంది. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్, ఓఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా రివర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. “కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. హిడింబ స్క్రీన్ ప్లే, విజువల్స్ రెగ్యులర్ గా కాకుండా కొత్తగా వుంటాయి” అని అన్నారు. దర్శకుడు అనీల్ కన్నెగంటి మాట్లాడుతూ “హిడింబ మూవీతో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఒక చరిత్రను వెతుక్కుంటూ వెనక్కివెళ్ళే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందితా శ్వేతా, శ్రీధర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News