Saturday, December 21, 2024

హైదరాబాద్‌లో హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మార్చి 1న జరిగిన పేలుడులో సిబ్బంది, కస్టమర్‌లతో సహా 10 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 12:50 నుండి 1 గంటల మధ్య బాంబు పేలింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ ఘటన అనంతరం ఎక్స్ లో సిసిటీవి ఫుటేజ్ కనిపించింది. అనుమానితుడు బాంబును కలిగి ఉన్న బ్యాగ్‌తో తిరుగుతున్న క్లిప్‌లు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.

రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై బెంగళూరు పోలీసులు కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బెంగుళూరులో పేలుడుతో హైదరాబాద్ లో హై అలర్ట్  ప్రకటించారు. పలు చోట్ల పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు, రద్దీ ప్రాంతాలు, మాల్స్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు పోలీసులు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News