Sunday, December 22, 2024

ముంబయిలో హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

పేలుళ్లకు కాలర్ బెదరింపులు
కొత్త సంవత్సర వేడుకలకు ముందు హెచ్చరిక

ముంబయి : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ముంబయి నగరంలో పెక్కు చోట్ల బాంబు దాడులు జరగగలనవి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదరించిన అనంతరం నగ ర పోలీసులు అత్యంత అప్రమత్తం అయ్యారు. శనివారం సాయంత్రం సుమారు 6 గంటలకు ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఆ కాల్ అందింది.

తత్సంబంధిత వివరాల ప్రకారం, ‘ముంబయిలో పేలుళ్లు జరగగలవు’ అని ఆ కాలర్ చెప్పి తన ఫోన్ కాల్‌ను నిలిపివేశాడు. ఆ కాల్ దరిమిలా పలు తనిఖీలు జరిపామని, కానీ అనుమానాస్పద వస్తువు ఏదీ కనిపించలేదని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, ఆ కాలర్ ఆచూకీ తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, కొత్త సంవత్సరం వేడుకలను పరిగణనలోకి తీసుకున్న ముంబయి పోలీసులు నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News