Sunday, September 29, 2024

పఠాన్ కోట్‌లో హైఅలర్ట్.. గ్రామాల్లో ఉగ్రవాదుల సంచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత వాయుసేన కీలక స్థావరంగా ఉన్న పఠాన్‌కోట్ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో బుధవారం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. పలు గ్రామాల్లో దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బోర్డర్ రేంజి డీఐజీ రాకేశ్ కుశాల్ మాట్లాడుతూ గత రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించినట్టు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టినట్టు తెలిపారు. ఇప్పటికే బీఎస్‌ఎఫ్, సహా అన్ని సెక్యూరిటీ ఏజేన్సీలకు అలర్ట్‌లు జారీ చేశామన్నారు.

పఠాన్‌కోట్ ఎస్‌ఎస్‌పీ సుహైల్ ఖాసీం మిర్ ఈ వివరాలను వెల్లడిస్తూ “ ఇద్దరు సాయుధులు కోట్ భటియాన్ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్టు గుర్తించాం. ఈ ప్రాంతం జమ్ముకశ్మీర్ లోని కథువా జిల్లాతో సరిహద్దులు పంచుకుంటోంది. ఈ అనుమానితులే కథువా లోని కోట్ పన్నూలో కూడా సంచరించినట్టు తెలిసింది” అని వెల్లడించారు. ఈనెల 12న పాక్ నుంచి కథువా జిల్లా సుక్‌పాల్ గ్రామం లోకి చొరబడిన ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News