Thursday, January 9, 2025

షరతులు వర్తిస్తాయి

- Advertisement -
- Advertisement -

ఈ కార్ రేస్ కేసులో ఎసిబి
విచారణకు కెటిఆర్ వెంట
న్యాయవాదిని అనుమతిస్తూనే
షరతులు విధించిన హైకోర్టు
విచారణగదికి దూరంగా ఉన్న
లైబ్రరిలో కూర్చొని వీక్షించాలని
న్యాయవాదికి ఆదేశం ఆడియో,
వీడియో రికార్డింగ్‌కు
న్యాయస్థానం నిరాకరణ
కెటిఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై
హైకోర్టు ఉత్తర్వులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్మూలా ఈ-కారు రేస్ కేసులో ఎసిబి విచారణకు మా జీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ వెంట న్యాయవాదిని అనుమతిస్తూ నే హైకోర్టు కొన్ని షరతులు విధించింది. విచారణ సమయంలో కెటిఆర్ సమీపంలో కాకుం డా దూరంగా లైబ్రరీ గదిలో కూర్చొని విచారణను వీక్షించాలని స్పష్టం చేసింది. ఎసిబి వి చారణ సమయంలో తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని కోరుతూ కెటిఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపిన అనంతరం ఈ మే రకు ఆదేశాలు జారీ చేసింది. ఎసిబి విచారణ లో కెటిఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావుకు అనుమతిస్తూనే పై షరతులు విధించిం ది. విచారణ సమయంలో కెటిఆర్ కనిపించే దూరంలో న్యాయవాది కూర్చొవాలని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ సూచించారు. విచారణ ను ఆడియో, వీడియో రికార్డు చేయించాలన్న కెటిఆర్ విజ్ఞప్తిని కూడా న్యాయమూర్తి నిరాకరించారు.

ఎసిబి జారీ చేసిన నోటీసు మేరకు గురువారం విచారణకు హాజరుకావాలని కూడా కెటిఆర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎసిబి జరిపిన విచారణ పై ఏమైనా అనుమానాలుంటే తమను మళ్లీ సంప్రదించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కెటిఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఆయన తరపున న్యాయవాది ప్రభా కర్‌రావు వాదనలు వినిపించారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇదే హైకోర్టు అనుమతించిన విషయాన్ని న్యాయవాది ప్రభాకర్ రావు కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. అయితే ప్రభుత్వ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి న్యాయవాదిని అనుమతించవద్దని వాదించారు. న్యాయవాదిని అనుమతిస్తే సమస్యేంటని ‘మీరు ఆయన మీద థర్డ్ డిగ్రీ’ ప్రయోగించడం లేదు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కెటీఆర్ తో పాటు విచారణలో లోపలికి వెళ్లడానికి ముగ్గురి పేర్లు ఇవ్వాలని కెటిఆర్ తరఫు న్యాయవాదికి న్యాయమూర్తి సూచిస్తూ, విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదావేసారు. అనంతరం కెటిఆర్ తరపున న్యాయవాది సూచించిన ముగ్గురిలో న్యాయవాది రామచంద్రరావు పేరు న్యాయమూర్తి ఖరారు చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News