Thursday, January 23, 2025

బిజెపి మహాధర్నాకు హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న (నేడు) బిజెపి తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలంటూ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద బిజెపి ధర్నాకు పిలుపునిచ్చింది. ఈనెల 14న, 20న ధర్నాకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. ప్రదీప్‌కుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ సి.వి.భాస్కర్రెడ్డి ధర్మాసనం అత్యవసర విచారణ జరిపారు. ధర్నా చౌక్ వద్ద ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని.. 1000 మంది ధర్నాలో పాల్గొంటే ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అధికార పార్టీ కూడా ధర్నాలు చేసిన సందర్భాలున్నాయని.. అలాంటప్పుడు మాత్రం అభ్యంతరాలు ఎందుకు రావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనరాదని.. ఆ మేరకు పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని బిజెపికి హైకోర్టు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News