Wednesday, November 27, 2024

మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సంచలనంగా మారిన నారాయణపేట జిల్లా మాగనూర్‌లో వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజినింగ్ అవ్వడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయ్యింది. ఫుడ్ కంటామినేట్ అవ్వడం చాలా సీరియస్ అంశమన్న సిజె పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్న హైకోర్టు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆక్షేపిం చా రు. మధ్యాహ్నం భోజనం వికటించిన పాఠశాలలో నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదిక వచ్చాక అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలంది. మాగనూరు పాఠశాలలో వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిం చడానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదికను సోమవారం సమర్పించాలని విచారణను వాయిదా వేసింది.

రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. పిటిషనర్ గురుతేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. మాగనూరు జడ్పీ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటించి పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కోర్టుకు వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థుల కు వడ్డించకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన వాదించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రనడానికి ఇది నిదర్శనమని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులకూ పిల ్లలున్నారు కదా అని, మానవత్వంతో వ్యవహరించాలని తెలిపింది. దీనిపై వివరాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని పిపి కోరడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకు? అని ప్రశ్నిం చింది.

సదరు అధి కారి వద్ద ఫోన్ లేదా ఇంటర్‌నెట్ సౌకర్యం లేదా లేకపోతే సదరు అధికారి మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో ఉన్నారా? అని లేదా అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉందా? అని అసహనం వ్యక్తం చేసింది. చిన్నారుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. పిల్లలు చని పోతే కానీ స్పందించరా? అని హైకోర్టు పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని, వివరణ ఇవ్వడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ విచారణ మధ్యలో హాజరై ఘటనకు సంబం ధించి పూర్తి వివరాలు సేకరించి భోజన విరామం తర్వాత సమర్పిస్తామని హైకోర్టుకు వెల్లడించారు. భోజన విరామం తర్వాత కొనసాగిన వాదనల సంద ర్భంగా ఎఎజి వాదించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు బయటి నుంచి చిరుతిళ్లు తిన్నారని కోర్టుకు వెల్లడించారు. కడుపునొప్పితో బాధపడిన చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. పూర్తిస్థాయి నివేదికను సోమవారం సమర్పిస్తామని ఎఎజి కోర్టుకు వెల్లడించారు.

మాగనూర్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే, అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు వారిని స్థానిక పిహెచ్‌సికి తరలించి చికిత్స చేయించారు. 29 మందిలో ఏడుగురు వెంటనే కోలుకోగా, మిగిలిన 22 మందిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బూరుగుపల్లి జెడ్పీ పాఠశాల ఘటనపైనా మండిపాటు
అలాగే మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై కూడా ధర్మాసనం మండి పడింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇప్పటివరకు ఫుడ్ పాయిజన్ అయిన అన్ని పాఠశాలల్లో నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపాలని, ఈ ఘటనలన్నింటి మీద సోమవారం వరకు పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వా న్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News