Saturday, April 19, 2025

విచారణ పూర్తయ్యే వరకు నియామకాలు వద్దు

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1పై హైకోర్టు ఆదేశం సర్టిఫికెట్ల
వెరిఫికేషన్ కొనసాగించవచ్చునని స్పష్టీకరణ
మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన
పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రంలో నిర్వహించిన గ్రూప్–1 నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు గ్రూప్–1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశించింది. అయితే ఎంపికైన అభ్యర్థుల స ర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించొచ్చని ధర్మాసనం వెల్లడించింది. పోస్టింగ్‌లు
మాత్రం తుది తీర్పు వెలువడేవరకూ ఇవ్వొద్దని క్లియర్‌గా స్పష్టం చేసింది. కాగా, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాయంలో గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు విడుదల చేయడానికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. అయితే గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలు పిటీషన్లు దాఖలు కావడంతో నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. యథావిధిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని, కాకపోతే తుది తీర్పు ఇచ్చే వరకూ పోస్తింగ్‌లు ఇవ్వొద్దని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దాంతో తమ నియామకాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో నిరాశ అలముకుంది. మళ్లీ గ్రూప్-1 పరిస్థితి ఇలా టర్న్ తీసుకుందేమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కాగా, గ్రూప్-1 పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని టిజిపిఎస్‌సి క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇష్యూ కోర్టుకు చేరడంతో నియామక ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో కోర్టు నిర్ణయంపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్‌ను సవాల్ చేస్తూ 20 మంది ఆభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. జిఆర్‌ఎల్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సరిగా నిర్వహించలేదని, అందుకే అభ్యర్థులు నష్టపోయారని పిటిషనర్లు పేర్కొన్నారు. మూల్యాంకనం, నియామకాలు నిబంధనలకు విరుద్ధమని, తిరిగి మూల్యాంకనం చేయాలని లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు ప్రతివాదులను ఆదేశించాలని 20 మంది గ్రూప్-1 అభ్యర్థులు అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం, టిజిపిఎస్‌సిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా, గ్రూప్-1 ఫలితాలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలుగు మీడియం విద్యార్థులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలొచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News