Thursday, January 16, 2025

హైకోర్టు సిజెగా సుజయ్ పాల్

- Advertisement -
- Advertisement -

హైకోర్టుకు మరో నలుగురు కొత్త న్యాయమూర్తులు
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఎపికి ఇద్దరు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్‌కు సిజెగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టు సిజెగా బదిలీ అయ్యారు. 1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్‌పాల్ బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు సిజెగా నియమితులయ్యారు.

నలుగురు కొత్త న్యాయమూర్తులు

కాగా తెలంగాణ హైకోర్టుకు మరో నలుగురు కొత్త న్యాయమూర్తులు నియామకం కానున్నారు. వీరిలో జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్‌రావు ఉన్నారు. వీరి నలుగురి పేర్లను సుప్రీంకోర్ట్ కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎపి హైకోర్టుకు హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జ్యూడీషీయల్ ఆఫీసర్ల కోటాలో మొత్తంగా ఈ ఆరుగురి పేర్లను తెలంగాణ, ఎపి హైకోర్టులకు కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News