Wednesday, January 22, 2025

201 జడ్జిల పోస్టులపై సిఫార్సులు అందలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జడ్జిల పోస్టులకు ఉన్న 201 ఖాళీలపై హైకోర్టు కొలీజియంలే జాప్యం చేశాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పదవుల భర్తీకి అర్హుల జాబితాను ఇప్పటికి వివిధ హైకోర్టులు తమ సిఫార్సుల పేర్లను పంపించలేదు. ఈ విషయాన్ని శుక్రవారం సభకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ఇప్పటివరకూ తమకు అందిన మొత్తం 123 ప్రతిపాదనలకు సంబంధించి 81 స్థానాల పేర్లు ఇప్పుడు వివిధ స్థాయిల్లో పరిశీలన దశల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు. కాగా ఇంతవరకూ 201 జడ్జి పోస్టులపై సంబంధిత కొలీజియంల నుంచి సిఫార్సులు తమకు చేరలేదనే విషయాన్ని గుర్తించలేదని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News