Wednesday, January 22, 2025

హైకోర్టులో ప్రణీత్ రావుకు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురైంది. ప్రణీత్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కోట్టేసింది. ఎలాంటి కండీషన్లు లేకుండా కస్టడీకి ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కస్టడీపై కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.  ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని సేకరించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు బయటపడిన విషయం తెలిసిందే.  సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. డిసెంబర్ 4న పాత హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం సహా ఏళ్ల తరబడి సీక్రెట్ గా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపేసినట్లు ప్రత్యేక టీం విచారణలో తేలింది.  ఈ కేసులో కీలక విషయాలపై కూపీ లాగుతున్న దర్యాప్తు అధికారులు ప్రణీత్ తో కలిసి పని చేసినవారిని విచారి స్తున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు వ్యవహారంలో ఇంటలిజెన్స్ ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్‌లను బయటకు తెప్పించేం దుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రణీత్ రావు వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న విషయాలు రాజకీయంగా పెను సంచలనం కలిగే అవకాశాలుగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News