Monday, December 23, 2024

రూ. 2000 నోట్ల మార్పిడిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడి ప్రూఫ్ లేకుండా రూ. 2000 నోటును మార్చుకోడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రభుత్వ విధానం నల్లధనాన్ని, మనీ లాండరింగ్, లాభపడ్డం లేక అవినీతిని ప్రోత్సాహించడం వంటిదని తాము చెప్పలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణ్యం ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం అది పూర్తిగా ప్రభుత్వం పాలసీ నిర్ణయం అని తెలిపింది. అంతేకాక అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఎలాంటి చీటి, ప్రూఫ్ లేకుండా రూ. 2000 నోట్లను మార్చుకోడానికి వీలుకల్పిస్తున్న ఆర్‌బిఐ, ఎస్‌బిఐ ప్రకటనను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. పిటిషనర్ దాదాపు 80 కోట్ల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయని, వారు రూ. 2000 నోటును అతి తక్కువగా ఉపయోగిస్తుంటారని, ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ ఉండగా ఎలాంటి ఐడెంటీ ప్రూఫ్ లేకుండా మార్చుకునే వీలు కల్పించడం ఏమిటని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News