Tuesday, January 21, 2025

పిఆర్‌సి… పర్సంటేజ్ ఛాలెంజ్ చేసే హక్కు మీకు లేదు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

High Court Fire on PRC

అమరావతి: పిఆర్‌సిపై దాఖలైన పిటిషన్లపై ఎపి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఉద్యోగులకు పిఆర్‌సి పెరిగిందో? లేదో చెప్పాలని కోర్టు అడిగింది. అంకెల్లో జీతం పెరిగిందో లేదా అని చెప్పాలని, పర్సంటేజ్‌ను ఛాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని హైకోర్టు తెలిపింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. పూర్తి డేటా లేకుండా ఎలా పిటిషన్ వేస్తారని కోర్టు ప్రశ్నించింది. పిఆర్‌సి నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరారు. ఉద్యోగుల గ్రాస్ జీతాలు పెరిగాయని ఎజి తెలిపారు. జీతాలు పెరిగాయని లెక్కలతో సహా కోర్టుకు ఎజి వివరించారు. ఈ పిటిషన్‌లో లీగల్ శాంటిటి లేదని ఉద్యోగులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా? బెదిరిస్తారని ప్రశ్నించింది. బెదిరించడమే కాకుండా రిట్ పిటిషన్ ఎలా వేస్తారని? నిలదీసింది. పిఆర్‌సి నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్దమన్నారు. హెచ్‌ఆర్‌ఎ విభజన చట్ట ప్రకారం జరగలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News