Tuesday, December 17, 2024

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయడం లేదని, నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. బుధవారం ఆ స్టేను ఎత్తివేస్తు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టులు భర్తీ కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News