Thursday, January 23, 2025

అది కెసిఆర్ తరం కాదు: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారికి  హైకోర్ట్ పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చింది. కోర్టు  ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కెసిఆర్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ఆమరణ దీక్ష చేస్తుంటే నన్ను ,మా కార్యకర్తలను పోలీసులు బుజాన తుపాకీ పెట్టి బందీలను చేశారని,  లోటస్ పాండ్ చుట్టూ అన్ని వైపులా బారికెడ్స్ పెట్టి చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారన్నారు.అకారణంగా కర్ఫ్యూ విధించి మా కార్యకర్తలను మెడ పట్టుకొని పోలీస్ వ్యాన్లలో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ లో పెట్టి దారుణంగా కొట్టారని ఇవ్వన్నీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారని ఆమె అన్నారు.

YSR బిడ్డ ఒకటే చెప్తుంది మీ త్యాగాలను వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవనని, పేరు పేరునా మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నన్నారు.పోలీస్ లు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా భరించారని, YSR పై మీకున్న అభిమానాన్ని మరొక్క సారి నిరూపించుకున్నారని ఆమె అన్నారు.YSR బిడ్డను కెసిఆర్ పంజరంలో పెట్టి బందించ వచ్చు అనుకుంటున్నాడని,అది కెసిఆర్ తరం కాదని వైఎస్ షర్మిల అన్నారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, మళ్ళీ చెప్తున్న కెసిఆర్..YSR సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టనని,YSR పాలన తిరిగి తీసుకు వచ్చేంత వరకు రెట్టింపు ఉత్సాహం తో పనిచేస్తానని ఆమె అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News