Tuesday, January 21, 2025

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

- Advertisement -
- Advertisement -

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈనెల 27 ఎన్నికల నిర్వహణకు వీలు కల్పించింది.

సింగరేణి ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా మూడు సంఘాల మధ్య  గట్టి పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలంటూ గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 27న ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలంటూ ప్రస్తుత ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై హైకోర్టు గురువారం విచారణ జరిపి, 27న యధావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News