హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఎనిమిది ఎకరాలపై అభ్యంతరం
2013 భూసేకరణ చట్టం ప్రకారం
పరిహారం చెల్లించటం లేదని
పిటిషనర్ ఆరోపణ విచారణ
వచ్చే నెల 7కు వాయిదా వేసిన
న్యాయస్థానం
మన తెలంగాణ/హైదరాబాద్: లగచర్ల, హకీంపేటలో భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నో టిఫికేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చే సింది. అదేవిధంగా భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయి దా వేసింది. అయితే, లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లోని భూ సేకరణ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మొ త్తం 8 ఎకరాలపై కోర్టు అభ్యతరం వ్యక్తం చేసి స్టే ఇచ్చింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి భూములను సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే లగచర్ల భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకించారు. కలెక్టర్ మీద కూడా దాడి జరిగిం ది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, రిమాండ్ చేశా రు. కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటనలో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యం లో భూసేకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఫార్మా కంపెనీ కోసం కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు ప్రభుత్వం సంసిద్దమైంది. మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్లలో భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణ నిలు పు దల చేయాలని కోర్టును అభ్యర్థించారు.
హకీంపేటలో కూడా భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. శివకుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాలని కోరారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు కోసం 351 ఎకరాల భూసే కరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదంటూ పిటిషనర్ ఆరోపించారు. కాగా, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణకు నవంబర్ 30న, డిసెంబర్ 1న రెండు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో దుద్యాల మండలంలోని లగచర్ల , పోలేపల్లి , హకీంపేట్ , పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1,177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉంది. అయితే, భూనిర్వాసితులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆయన గ్రామా ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో వారంతా భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల , పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే కాగా పోలేపల్లి రైతులకు నష్ట పరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులను రైతులు అడ్డుకున్న విష యం విదితమే.