హైదరాబాద్: మావోయిస్టు ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఉత్తర్వులను పోలీసులు సవాలు చేశారు. వాదనలు వినకుండా జిల్లా కోర్టు తీర్పు వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. 2010లో ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఆజాద్ సహా జర్నలిస్ట్ హేమచంద్రపాండే పోలీసుల ఎన్కౌంటర్ లో హతమయ్యారు. అది బూటకపు ఎన్కౌంటర్ అని, వారిద్దరినీ సజీవంగా పట్టుకొని చిత్రహింసలు చేసిన అనంతరం చంపారని పలు హక్కుల సంఘాలతో ఆజాద్ భార్య పద్మ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బూటకపు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 29 మంది పోలీసులపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆగదని గతంలో పద్మ మీడియాతో మాట్లాడిన విషయం విధితమే.
ఆజాద్ ఎన్ కౌంటర్…. ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు ఉత్తర్వులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -