Sunday, April 6, 2025

కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ..

- Advertisement -
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హెచ్ సీయూకు సంబంధించిన దాదాపు 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ భూముల్లోని చెట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున జేసీబీలను తరలించారు.దీంతో హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, భారీగా మోహరించిన పోలీసులు.. విద్యార్థులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది.

ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హెచ్‌సీయూ తరఫున ఎల్. రవి చందర్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ భూమి అయినా సుప్రీం కోర్టు తీర్పుకు లోబడే పని చేయాలని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలి అంటే నిపుణుల కమిటీ వేయాలని.. కానీ, సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని రవిచందర్‌ తెలిపారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News