Monday, January 6, 2025

మల్లయ్య డెడ్ బాడీ భద్రపరచండి.. ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు..

- Advertisement -
- Advertisement -

ములుగు ఎన్‌కౌంటర్‌ కేసుపై హైకోర్టులో మంగళవారం విచారణ చేపట్టింది. మృతదేహాలను పోస్ట్ మార్టం ప్రక్రియ సరిగ్గా చేయలేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి ప్రభుత్వ తరుఫు న్యాయవాది సమాధానమిస్తూ.. 8 మంది వైద్య నిపుణులతో పంచనామా పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు.

అనంతరం, ఎన్‌కౌంటర్‌ పరిణామాలతో పాటు తదుపరి చర్యలు, పోస్ట్ మార్టం రిపోర్ట్‌ను అందజేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. మృతి చెందిన మల్లయ్య మృతదేహం తప్ప మిగిలిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు చెప్పింది. అయితే.. మృత దేహాలు భద్రపరచడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News