Monday, December 23, 2024

ఓఆర్‌ఆర్ టివోటిపై పిల్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్(ఒఆర్‌ఆర్)టిఓటి పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. గడీల రఘువీరారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై వి చారణ జరిపింది. విచారణ సందర్భంలో పిటిషనర్ అర్హతను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రశ్నించారు. తాను ఒక సామాజిక కార్యకర్తనంటూ కోర్టుకు పిటిషనర్ తెలిపారు. దేశంలో పిల్ దాఖలు చేసే మెకానిజంను దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో పాల్గొన్న బిడ్డర్లు అవకతవకలు జరిగాయాని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని హైకో ర్టు తెలిపింది. ఇదే సందర్భంలో ఆర్‌టిఐ నుండి సమాచారం తీసుకున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తమకు కావాల్సిన సమాచారం ఆర్‌టిఐ ఇవ్వలేదని రఘువీర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఏకపక్షం గా ఒక సంస్థ కు టెండర్లు కట్టబెట్టారని పిటిషనర్ అన్నారు. ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టారనడానికి ఆధారాలు ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు చూపించని కారణంగా పిటిషన్‌ను ్ట కొట్టివేసింది.
జస్టిస్ అలోక్ అరాధే ఆసక్తికర వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా పిటిషనర్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్‌టిఐలో సమాచారం అడిగినప్పుడు, హెచ్‌ఎండిఏ నుంచి పూర్తిస్థాయిలో మీకు సమాచారం రానప్పుడు అప్పిలేట్ అథారిటీ ఉంది కదా…? మరి కోర్టుకు ఎందుకు వచ్చినట్లు అని సిజె పిటిషనర్ ను ప్రశ్నించారు. ఆర్టీఐలో ఇవ్వదగ్గ సమాచారం మాత్రమే ఇస్తారు, ఇవ్వలేనిది కారణాలు వివరిస్తారు, అందులో తృప్తి లేకపోతే అప్పీల్ కు వెళ్ళవొచ్చు అని సిజె వ్యాఖ్యానించారు. మీ పాయింట్స్ ‘ఊహాజనితంగా’ ఉన్నాయి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News