నాగర్‌కర్నూల్ జిల్లాలో సకాలంలో వైద్యం అందకపోవడంతో తల్లి శిశువు మృతి చెందిన ఘటన తెలిసిందే. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని కుటుంబ సభ్యులు అమ్రాబాద్ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్ళాగా అక్కడి నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళారు అక్కడ వైద్యులు మహబూబ్‌నగర్ పాథమిక ఆసుపత్రికి తీసుకెళ్ళమని పంపించారు. అక్కడ స్వర్ణకు డాక్టర్లు సాధారణ ప్రసవం చేయగా ఊపిరి పీల్చుకోలేక శిశువు వెంటనే మృతి చెందగా ,
ఫిట్స్, గుండెపోటుతో తల్లి స్వర్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై హై కోర్టులో విచారణ వేశారు. తెలంగాణ హై కోర్టు కేసును సమోటుగా స్వీకరించింది. 9 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,అమ్రాబాద్, అచ్చంపేట ఆసుపత్రుల సూపరింటెండ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 28కు వాయిదా వేశారు.