- Advertisement -
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొనుగోలు కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల రీమాండ్ రీజెక్ట్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎసిబి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. నిందితులను రిమాండ్ కు తీసుకోవచ్చని కోర్టు పోలీసులకు తెలిపింది. నిందితులు 24 గంటల్లోపు సైబరాబాద్ సిపి ఎదుటు లొంగిపోవాలని ఆదేశించింది. తదుపరి ఎసిబి కోర్టులో నిందితులను ప్రవేశపెట్టాలని పేర్కొంది. టిఆర్ఎస్ ఎంఎల్ఎలకు డబ్బులు ఇచ్చి కొనుగోలుకు యత్నించిన ముగ్గురు నిందితులను 24 గంటల్లో న్యాయస్థానం ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. టిఆర్ఎస్ ఎంఎల్ఎ రోహిత్ రెడ్డి బిజెపిలో చేరితే వంద కోట్ల రూపాయలు ఇస్తామని రామచంద్ర భారతి స్వామీజీ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -