కొలువుదీరిన పది మంది న్యాయమూర్తులు
ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్
మనతెలంగాణ/హైదరాబాద్: హైకోర్టులో నూతనంగా నియమితులైన 10 మంది నూతన న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదే వి, ఎన్ శ్రవణ్‌కుమార్ వెంకట్, గుణ్ణు అనుప మ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్‌దేవరాజ్ నాగార్జునలతో ని మొదటి కోర్టు హాల్‌లో చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏ డుగురు, న్యాయాధికారుల కేటగిరీ నుం చి ఐదుగురితో కలిపి మొత్తం 12మంది పేర్లు సిఫార్సు చేశారు.
వీరిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, శ్రావణ్ కుమార్ వెంకట్ ఉన్నారు. న్యాయాధికారుల విభాగం నుంచి అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, నాగార్జున్‌లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియ మిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. కొత్త న్యాయమూర్తుల నియామకంతో మొ త్తం సంఖ్య 29కి చేరింది. హైకోర్టులో ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలిసారని కోర్టు వర్గాలు వెల్లడించాయి.