Sunday, December 22, 2024

మథురలో మసీదు సర్వేపై హైకోర్టు తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీం తీర్పు పెండింగ్

మథుర: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు వద్ద ప్రాథమిక సర్వే నిర్వహించడంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. హైకోర్టులో విచారణ సందర్భంగా మసీదు వద్ద నిర్వహించే సర్వే ఏ రూపంలో ఉండాలన్న విషయమై హైకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయవాద కమిషనర్లతో కూడిన బృందం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. కృష్ణ జన్మభూమి కేసుపై తాము దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ముస్లిం పిటిషనర్లు హైకోర్టులో వాదించారు.

దీంతో ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇలా ఉండగా, భారత పురావస్తు శాఖ(ఎఎస్‌ఐ) సోమవారం తన నివేదికను హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. డిసంబర్ 21న పిటిషనర్లకు ఎఎస్‌ఐ నివేదికతోపాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతిని హైకోర్టు అందచేస్తుంది. కాగా..మథురలో కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదును ప్రాథమిక సర్వే చేయడానికి అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు డిసెంబర్ 5న నిరాకరించింది.

కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల న్యావాద కమిషనర్లు ఈద్గా మసీదును ప్రాథమిక సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. ఈద్గా సముదాయంపై డజనుకు పైగా పిటిషన్లు అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. కృష్ణ జన్మభూమికి చెందిన 13.37 ఎకరాల స్థలంలో ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ రాజు ఔరంగజేబ్ మసీదును నిర్మించాడంటూ హిందూ పక్షాల తరఫున పిటిషన్లు దాఖలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News