Thursday, January 23, 2025

పదిలో టాపర్‌లను సన్మానించిన హైకోర్టు లాయర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

- Advertisement -
- Advertisement -

చేగుంట: మండల పరిధిలోనే 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని చందాయిపేట జాగీర్ దోర హైకోర్టు లాయర్ మీరు ఉస్మాన్ అలీ ఖాన్, గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్‌లు సన్మాంచారు. ఆదివారం చందాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో చందాయిపేట గ్రామానికి చెందిన విద్యార్థి 10/10 మార్కులు సాధించినందుకు రూ.10 వేలు హైకోర్టు లాయర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అందజేశారు. అదేవిధంగా 9.6 వచ్చిన ఇద్దరి విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, 9.3 వచ్చిన విద్యార్థినికి రూ.3 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధ్ది చెందాలంటే విద్యార్థులు బాగా చదువుకుని పుట్టిన గ్రామాలకు సహకారం అందిస్తేనే సాధ్యం అవుతుందని ఎంత పెద్ద వారైనా గ్రామాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు.

మనం బాగా చదువుకుని పుట్టిన గ్రామానికి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని కోరారు. గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మన విద్యార్థులు బాగా చదువుకున్నారని వారికి మనం మరింత ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని తనను కోరగానే నా వంతు సాయంగా నేడు అందజేయడం జరిగిందని తెలిపారు. మీరు బాగా చదువుకుని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, నాయకులుగా ఎదిగి గ్రామానికి మీ వంతు సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్‌కుమార్,వార్డు సభ్యుడు, కో ఆప్షన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News