Sunday, December 22, 2024

రజాకార్ మూవీ రిలీజ్ పై స్టేకు హైకోర్టు నో!

- Advertisement -
- Advertisement -

కొన్నాళ్లుగా వివాదాల మధ్య నలుగుతున్న రజాకార్ మూవీకి ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ఈ మూవీ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో శుక్రవారంనాడు తెలుగు,తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రజాకార్ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలంటూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఎపిసిఆర్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మూవీ హిందూ ముస్లింల మనోభావాలను కించపరిచేదిగా ఉందని ఎపిసిఆర్ తెలంగాణా విభాగం ఉపాధ్యక్షుడు, న్యాయవాది అఫ్సర్ జహాన్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందనీ, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిపుణుల కమిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చుననీ తెలిపింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను సవాల్ చేయనందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. రజాకార్ మూవీని గూడురు నారాయణరెడ్డి నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News