కేంద్రానికి, ఎఫ్‌సిఐకి హైకోర్టు నోటీసులు
మనతెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు హైకోర్టులో న్యాయవిద్యార్ధి శ్రీకర్ ప్రజాప్రయోజాన వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ధాన్యం కొనుగోళ్లపైన వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సిఐతో పాటు రాష్ట ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో వానాకాలంలో పండించిన ధాన్యం నుంచి 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని ఎఫ్‌సిఐ ఆగస్ట్ 17న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. ధాన్యం కొనుగోలులో చొటు చేసుకున్న పరిణామాలను కొర్టు దృష్టికి తెచ్చారు. కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేలా ఎఫ్‌సిఐని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పిటీషనర్ వాదనలపైస్పందించిన న్యాయస్థానం వివరాలు తెలపాలని కేంద్రానికి ,ఎఫ్‌సిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది.