Saturday, April 5, 2025

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి షాక్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

నేడు జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడి కేసు విచారణలో,  నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నేడు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సిఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News