Wednesday, January 22, 2025

ఎంఎల్‌సి శంభీపూర్ రాజు తండ్రికి హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి శంభీపూర్ రాజు గెస్ట్‌హౌస్ స్థలం రిజిస్ట్రేషన్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. 166/23 గెస్ట్ హౌస్ స్థలం పై రిట్ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు జస్టిస్ విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం ప్రతి వాదులైన ఎంఎల్ సి శంభీపూర్ రాజు తండ్రి సుంకరి ఆంజనేయులు, అధికారులకు నోటీసులు జారీ చేశా రు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో ప్రజా సంపద దోపిడీపై పోరాటమాపేది లేదని ఈ సందర్భంగా నిజాంపేట్ బిజెపి అధ్యక్షుడు ఆకుల సతీష్ పేర్కొన్నారు దుండిగ ల్ మండలం, బౌరంపేట్ గ్రామంలో సర్వేనెంబర్ 166/23 నందు బిఆర్ ఎస్ ఎంఎల్‌సి శంభీపూర్ రాజు తన తండ్రి సుంకరి

ఆంజనేయులు పేరు మీద 3.04 ఎకరాల ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన స్థలం కొనుగోలు చేశాడు. తప్పుడు రిజిస్ట్రేషన్ జీవో నెంబర్ 307/2013 వ్యతిరేకంగా ఎన్‌ఒసి పొందకుండానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ అయిన పదేళ్ల తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్‌ఓసి పొందారు. అ నుమతులు లేకుండా గెస్ట్ హౌస్ నిర్మాణం, దాదాపు ఎకరం ప్రభుత్వ భూమి ఆక్రమణ లపై కలెక్టర్, ఎమ్మార్వో, కమిషనర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపో వడంపై హైకోర్టులో నిజాంపేట్ బిజెపి అధ్యక్షుడు ఆకుల సతీష్ తరఫున సీనియర్ న్యా యవాది వెంకటరాజు గౌడ్, జూ. న్యాయవాది శ్రావణ్ రెడ్డి రిట్ పిటిషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News