Friday, December 20, 2024

దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి విజయారెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించి, నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. దానం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంనుంచి బిఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ఓడిపోయారు. అయితే ఇటీవల దానం బిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచారని, డబ్బులు పంచారని విజయారెడ్డి కేసు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News