Sunday, December 22, 2024

జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు ఇచ్చింది. ఆమెతో పాటు పర్యావరణ, భూగరర్భ గనుల శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లో కొండరాళ్లను తొలగించేందుకు రేయింబవళ్లు పేలుళ్లు జరుపుతుండడంతో ఈ విషయమై వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక చీప్ జస్టిస్‌కు లేఖ రాశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా దాదాపు పది పేలుళ్లు జరిపి బండరాళ్లను తరలిస్తున్నట్లు ఆయన తన తేఖలో వెల్లడించారు.

రాత్రిపూట పెద్ద శబ్దాలు వస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వెల్లడించారు. ఈ లేఖను న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. అనంతరం పర్యావరణ, భూగర్భ గనులు, పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీలతో పాటు జిహెచ్‌ఎంసి కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పేలుళ్లపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా వారికి నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News