Wednesday, November 13, 2024

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల విసిలకు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

High Court notices to Kakatiya and Telugu universities

హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకంపై హైకోర్టులో పిల్ వేశారు. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ పిల్ పై సిజె జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కెయు, తెలుగు వర్సిటీ వీసీల నియామకం జరిగిందన్న పిటిషనర్ తెలిపాడు. కెయు విసికి పదేళ్ల అనుభవం లేదని పిటిషనర్ వాదించాడు. తెలుగు వర్సిటీ విసికి 70 ఏళ్లు దాటాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి హైకోర్టు ఆదేశించింది. కెయు విసి రమేష్, తెలుగు వర్సిటీ విసి కిషన్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను అక్టోబరు 27కి కోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News