Monday, December 23, 2024

కోర్టు ధిక్కరణ కేసులో మంత్రి పువ్వాడకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్ట్ నోటీసు జారీ చేసింది. మమత మెడికల్ కాలేజీ చైర్మన్ హోదాలో పువ్వాడ అజయ్ కి నోటీసులిచ్చింది. 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలను గతేడాది హైకోర్టు ఆదేశించింది. కానీ 2017 జీవో ప్రకారం మమతా కాలేజీ పెంచిన ఫీజులు వసూలు చేసింది.

మమత మెడికల్ కాలేజీ తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని హైకోర్ట్ లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్.. కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్ కి నోటీసు జారీ చేసిన హైకోర్ట్ తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News