Wednesday, January 22, 2025

క్యాట్‌కు ఆ అధికారం లేదు

- Advertisement -
- Advertisement -

ఐఎఎస్, ఐపిఎస్‌ల
కేటాయింపు వ్యవహారంపై
హైకోర్టు కీలక తీర్పు
మన తెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత స ర్వీస్ అధికారుల కేటాయింపుపై తెలంగాణ హై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉన్నతాధికారుల కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు కేంద్రం చేసిన ఐఎఎస్,, ఐపిఎస్‌ల కేటాయింపుల్ని కొందరు అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. క్యాట్ నుంచి స్టే తెచ్చుకుని కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు తెలంగాణలో కొనసాగారు. క్యాట్ తన పరిధిని దాటి ఉత్తర్వులిచ్చిందని సవాల్ చేసిన కేం ద్రం వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుం ది.

ఈ మేరకు గతంలో క్యాట్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టేసింది. అధికారుల కేటాయింపు డివొపి టి పరిధిలో ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. అధికారుల కేటాయింపుపై క్యాట్‌కు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. కేటాయింపులపై అధికారులు తిరిగి కేంద్రాన్ని అభ్యర్థించాలని ఉన్నత న్యాయ స్థానం సూచించింది. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలంది. పునః కేటాయింపులు చేసే వరకు ఐఎఎస్‌లు యథాతథంగా కొనసాగవచ్చని హైకోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News