Sunday, September 22, 2024

కరోనా పరీక్షలు పెంచండి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Municipal elections

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని గురువారం హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కరోనా వైరస్‌కు సంబంధించి కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. జిహెచ్‌ఎంసి పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున వార్డుల వారీగా కేసుల వివరాలను ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వం డాక్టర్లకు పిపిఇకిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారించింది. ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ, యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు రాజారావు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు హైదరాబాద్‌లో వార్డుల వారీగా కరోనా కేసులను వెల్లడించి వారిని ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని స్పష్టం చేసింది.

కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని, జిహెచ్‌ఎంసి పరిధిలో వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలపై గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల కరోనా పరీక్షలు ఎందుకు జరపడం లేదని ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అనుమానితులకే కరోనా పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని హైకోర్టుకు ఎజి తెలిపారు. ఈక్రమంలో లక్షణాలు ఉన్న వారికే పరీక్ష చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల్లో ఎక్కడుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

High Court Order to TS Govt more Corona Tests

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News