హైదరాబాద్: ఐఎన్సీ ఇన్ర్ఫాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీకి కేటాయించిన టెండర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి మే 1 స.హ. చట్టం ప్రకారం దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వక పోవడంతో హైకోర్టు పిటిషన్ వేశారు. రేవంత్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Also Read: కారు పార్కింగ్ కోసం సిఎం కాన్వాయ్ ను అడ్డుకున్న వృద్ధుడు
ఒక ఎంపికి సమాచారం ఇవ్వకపోతే పార్లమెంట్ లో ఎలా చర్చించగలరని హైకోర్టు ప్రశ్నించింది. స.హ. చట్టంలో పరిమితుల మేరకు సమాచారం ఇస్తామని ఏజీ ప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల సమయంను ఏజీ ప్రసాద్ హైకోర్టును కోరారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.