Thursday, October 17, 2024

వెళ్లి తీరాల్సిందే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ కేడర్ రాష్ట్రానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్న ఐఎఎస్ అధికారులకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. దీం తోవరుసగా వీరికి డిఒపిటి, క్యాట్, హైకోర్టు రూ పేణా దెబ్బ మీద దెబ్బ తగిలింది.. క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. తెలంగాణ హైకోర్టు కూ డా వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆ దేశించింది. ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో అధికారుల కు న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. అ న్ని మార్గాలు మూసుకుపోవడంతో విధిలేక కోర్టు ఆదేశాల మేరకు ఎక్కడి వారక్కడ రిపోర్టు చేయక తప్పలేదు. తమను రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఎఎస్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. డిఒపిటి కేటాయిం చిన రాష్ట్రాల్లో ముందు మీరు విధుల్లో చేరాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి అంశాలపై స్టే ఇస్తూ వెళి తే కనుక ఎన్నటికీ తేలదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మీరంతా బాధ్యతాయుతమైన అధికారు లు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉండవద్దని హితవు పలికింది. మీరు ఎక్కడ పని చేయాలో డిఒపిటి నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అయితే రిలీవ్ చేసేందుకు పదిహేను రోజుల గడువును రెండు రాష్ట్రాలు డిఒపిటిని కోరాయని ఐఎఎస్‌ల తరఫు న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. క్యాట్ తుది తీర్పు వచ్చే వరకు రిలీవ్ చేయవద్దని కోరారు. క్యాట్‌లో నవంబర్ 4న విచారణ ఉంద ని, కాబట్టి అప్పటి వరకు రీలీవ్ చేయవద్దని విజ్ఞ ప్తి చేశారు. ఉద్యోగులు ఎక్కడ పని చేయాలో కో ర్టులు నిర్ణయించవద్దని డిఒపిటి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహ శర్మ కోర్టుకు వెల్లడించారు. వారి పిటిషన్‌పై క్యాట్ స్టే ఇవ్వకపోవడం సరైన నిర్ణయమే అని పేర్కొన్నారు. డిఒపిటి నిర్ణయం సరైనదని చెప్పడానికి పూర్తి కారణాలను క్యాట్‌లో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం అధికారుల పిటిషన్లను కొట్టివేసింది.

ఈనెల 9న ఆ ఐఏఎస్‌లకు డిఒపిటి ఉత్తర్వులు
ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్ లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎపికి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఎపిలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణకు రావాల్సి ఉంది. ఈ మేరకు డిఒపిటి ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ నలుగురు ఐఎఎస్‌లు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ వేశారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించారు. డిఒపిటి ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ఇదీ వివాదం
ఉమ్మడి రాష్ట్రంలోని ఐఎఎస్, ఐపిఎస్‌లను 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపిఎస్‌లు అంజనీ కుమార్, సం తోశ్ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఆంధ్రాకు కేటాయించారు. ఐఎఎస్ కేడర్‌కు చెందిన అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్‌ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సి.హరి కిరణ్, ఐపిఎస్ ఆఫీసర్ ఎవి రంగనాథ్‌ను తెలంగాణకు కేటాయించారు.
ఐఎఎస్‌లకు రిలీవ్
తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ స్థానంలో ప్రభుత్వం ఇన్‌చార్జీలను నియమించింది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసి కమిషనర్‌గా (ఎఫ్‌ఏసిగా) ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ వెల్ఫేర్ ట్రస్ట్ సీఈఓగా (ఎఫ్‌ఏసిగా) ఆర్వీ కర్ణన్, ఆయుష్ డైరెక్టర్‌గా (ఎఫ్‌ఏసిగా) క్రిస్టినా, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా (ఎఫ్‌ఏసిగా) టికె శ్రీదేవీ, ఎనర్జీ సెక్రటరీగా (ఎఫ్‌ఏసిగా) సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా (ఎఫ్‌ఏసిగా) శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

సిఎస్‌ను కలిసి జాయినింగ్ రిపోర్టు చేసిన ఎపి ఐఏఎస్‌లు
సిఎస్ శాంతికుమారిని ఎపి ఐఏఎస్‌లు కలిశారు. డిఓపిటి ఆదేశాల మేరకు ఎపి నుంచి వచ్చిన ఐఏఎస్‌లు సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణ సిఎస్‌కు జాయినింగ్ రిపోర్టును అందజేశారు.
ఈ మెయిల్ ద్వారా ఎపి సిఎస్‌కు రిపోర్టు చేసిన తెలంగాణ ఐఏఎస్‌లు
కాగా, డిఓపిటి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలిలు ఈ మెయిల్ ద్వారా ఎపి సిఎస్‌కు రిపోర్టు చేశారు. అంతకుముందు క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టును ఐఏఎస్‌లు ఆశ్రయించినా వారికి ఊ రట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముందు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఐఏఎస్‌లు సిఎస్‌లకు రిపోర్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News