Wednesday, December 25, 2024

మంత్రి కొప్పులకు హైకోర్టులో చుక్కెదురు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిపింది. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి కొప్పుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అనంతరం కొప్పుల ఎన్నిక వివాదంపై విచారణను కోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది.

కాగా, ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించినట్లు తేలడంతో.. ఎన్నికలో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News