Monday, January 20, 2025

పట్నం నరేందర్ రెడ్డికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. చర్లపల్లి జైలులో తనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలంటూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది ఈ మేరకు హైకో ర్టు రిజిస్ట్రీకి పిటిషన్‌ను సమర్పించారు. నేరస్థులు ఉండే బ్యారక్‌లో పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మాజీ ఎంఎల్‌ఎ అయిన పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను పరిశీ లించిన హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్న సంగతి విదితమే. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ కేసులో పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌lలో వాకింగ్‌lకు వెళ్లిన ఆయనను జిల్లా క్రైం, కొడంగల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

అక్కడి నుంచి వికారాబాద్‌లోని పోలీస్ ఆఫీసుకు, తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ హైదరాబాద్‌మల్టీ జోన్–2 ఐజి సత్య నారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్ది, పరిగి డిఎస్‌పి కరుణాకర్ రెడ్ది, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్ది తదితరులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. తర్వాత నరేందర్‌రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి కొండగల్ ప్రభుత్వ దవాఖానకు వైద్య పరీక్షల కోసం తరలించారు. రిమాండ్ రిపోర్టు లో ఆయనను ఏ1గా చేర్చారు. కన్ఫెషన్ స్టేట్‌lమెంట్‌lలో తానే సురేశ్‌lతో దాడి చేయించానని, ఆర్థికంగా సహకరించారనని నరేందర్‌రెడ్డి ఒప్పు కోవడంతో ఏ1గా ఆయనను చేర్చినట్లు, ఏ2గా సురేశ్‌lను మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు వరకు సురేశ్ పేరు ఎ1గా ఉండేది. బుధవారం సాయంత్రం కొండగల్ ఫస్ట్ క్లాస్‌మెజిస్ట్రేట్ శ్రీరామ్ ఎదుట నరేందర్‌రెడ్డిని హాజరు పరచగా, 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్‌రెడ్డి గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వాధికారులపై రాళ్ల దాడి కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డి, తన న్యాయవాదులు ద్వారా కోర్టుకు అఫిడవిట్ పంపించారు. మరో వైపు నరేందర్‌రెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికా రాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News