Monday, December 23, 2024

గంగుల కమలాకర్ ఎన్నిక వివాదం.. బండి సంజయ్ పై హైకోర్టు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై మంగళవారం రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ గతంలో కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు, బండి సంజయ్ తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్ కు సంజయ్ హాజరయ్యేందుకు గడువు ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాది కోర్టును కోరారు.

దీంతో పలుమార్లు గడువు కోరడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిినట్లు సమాచారం. ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణను ముగిస్తామని కోర్టు చెప్పడంతో ఈ నెల 12న బండి సంజయ్ హాజరవుతారని ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరుకావాలంటే సైనిక సంక్షేమ నిధికి బండి సంజయ్ రూ.50 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News