Wednesday, January 22, 2025

కడుపులో గుడ్డ మర్చిపోయిన ఘటనపై హైకోర్టు సీరియస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఆపరేషన్ చేసి కడుపులో గుడ్డ మర్చిపోయిన ఘటన 16 నెలల తర్వాత బయటకు వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ జరిగిన 16 నెలల తర్వాత కడుపులో క్లాత్ ఉన్నట్లు వెలుగులోకి రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం ఎలా ఉంటుందో ఈ సంఘటనతో మరోసారి నిరూపితమైంది. ఈ ఘటనపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్మయా నికి గురిచేసిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హైకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది.
రెండ్రోజుల క్రితం వెలుగు చూసిన ఘటన
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి మహిళ కడపులో ఓ పెద్ద గుడ్డ ముక్కను వదిలేశారు. సరిగ్గా 16 నెలల క్రితం ఇది జరిగింది. తర్వాత మహిళను డిశ్చార్జి చేయడంతో ఆమె ఎప్పటిలాగే రోజు వారీ పనులు చేసుకుంటోంది. ఇటీవల కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో ఈ సారి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు స్కానింగ్ చేయగా, కడుపులో గుడ్డ పీలిక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి గుడ్డ ముక్కను తొలగించారు. గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్యశ్రీ అనే మహిళకు డెలివరీ అయింది. డెలివరీ సమయంలో సర్జరీ చేసిన వైద్యులు ఆమె కడుపులోనే బట్టను మర్చిపోయారు. అలాగే కుట్లు వేసేశారు. సంవత్సరం తర్వాత నవ్యశ్రీ కి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్టని తొలగించారు. ఆ గుడ్డ ముక్క చాలా పెద్ద సైజులో ఉంది. క్లాత్‌ను బయటకు తీస్తుండగా దీనిని వీడియో తీశారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఆపరేషన్ చేసే సమయంలో కడుపు లోపల కత్తి, కత్తెర లాంటి పరికరాలు మర్చిపోవడం, వాచ్ లోపల ఉంచేసి కుట్లు వేసిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పుడు మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడటంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై నవ్యశ్రీ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు చేశారు. మహిళ తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ యాస్మిన్ ఆ మహిళలు సర్జరీ చేసిన డాక్టర్లు, వారికి అసిస్టెంట్లు వ్యవహరించిన నర్సులు, మిగతా రికార్డులు అన్నింటిని సమర్పించాలని సదరు ఆస్పత్రి ఉన్నత వైద్యాధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News